IPL 2018 : Dhoni Also Unable To Save Chennai | Oneindia Telugu – Chennai Video



Mahendra Singh Dhoni battled through constant back pain and almost pulled off another sensational run chase for Chennai Super Kings but that didn’t happen as the Yellow Army lost their first match in the Indian Premier League (IPL) 2018 here on Sunday.

చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్రేక్ వేసింది. చెన్నైపై 4 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ ధోనీ 44 బంతుల్లో(79) నాటౌట్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. రాయుడు (49) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై 2 వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌కి భారీ స్కోరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సవాల్ విసిరింది. కాగా, పంజాబ్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 197/7 స్కోరు చేసింది. మొహాలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌గేల్ 33 బంతుల్లో (63), కేఎల్ రాహుల్ (37) చెలరేగి ఆడారు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గేల్. మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులను తన సిక్సర్లతో అలరించాడు.
షేన్ వాట్సన్ వేసిన అనూహ్య బంతిని షాట్ ఆడగా.. బ్యాట్‌కు టాప్ ఎడ్జ్ అయిన బంతి ఫీల్డర్ ఇమ్రాన్ తాహిర్ చేతిలో పడింది. దీంతో యూనివర్స్‌ బాస్‌.. గేల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం తనదైన శైలిలో మరోసారి విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు చుక్కలు కనిపించాయి.
గేల్ దూకుడుతో తొలి పది ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చెన్నై బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకుని పంజాబ్‌‌ని కట్టడి చేశారు.
గాయం కారణంగా సురేశ్ రైనా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు ధోనీ తెలిపాడు. అతని స్థానంలో మురళీ విజయ్ జట్టులోకి వచ్చాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter: https://twitter.com/thatsTelugu
♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

source

Some local news is curated - Original might have been posted at a different date/ time! Click the source link for details.

4 Comments - Write a Comment

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.